Bethaludu movie collections‘బిచ్చగాడు’ సినిమా ఘనవిజయంతో తెలుగునాట ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న విజయ్ అంటోనీ నటించిన తాజా చిత్ర ‘భేతాళుడు’ రెండు రోజుల క్రితం విడుదలై ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలను దక్కించుకుంది. అయితే ఓపెనింగ్స్ లో మాత్రం ‘బిచ్చగాడు’ని బీట్ చేసి, సరికొత్త రికార్డులు సృష్టించింది. ఆశించిన టాక్ రాకపోయినప్పటికీ తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1 కోటి రూపాయలకు పైగానే వసూలు చేయడం విశేషం. దీంతో కలెక్షన్ల పరంగా ఈ సినిమా కూడా నష్టాలలోకి చేరుకోకపోవచ్చని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే, మరో పక్కన తమిళంలో “సైతాన్”గా విడుదలైన ఈ సినిమా విజయ్ కెరీర్ లో ఆల్ టైం రికార్డులను అందుకుంది. తొలి రెండు రోజుల్లోనే 5 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని ట్రేడ్ పండితులను అవాక్కు చేసింది. దీంతో ఈ వీకెండ్ నాటికి ‘సైతాన్’ బ్రేక్ ఈవెన్ పాయింట్ కు చేరుకోవడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. టాక్ తో నిమిత్తం లేకుండా ‘బిచ్చగాడు’ ప్రభావంతో రెండు భాషల్లోనూ ‘భేతాళుడు’ గట్టెక్కినట్లేనని సినీ జనాలు చెప్పుకుంటున్నారు.