Bermuda-Triangle-finally-discoveredబెర్ముడా ట్రయాంగిల్… బ్రిటన్ ఇంటర్నేషనల్ వాటర్స్ నుంచి ఫ్లోరిడా తీరంలోని ప్యూర్టోరికా వరకూ విస్తరించిన ప్రదేశం. ఈ ప్రాంతంలోకి ప్రయాణించిన ఎన్నో నౌకలు ఒక్కసారిగా అదృశ్యమై పోయాయి. ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాలు ఎలా మటుమాయం అయ్యాయో అన్న విషయం తెలియక శాస్త్రవేత్తలు తలలు పట్టుకున్న ఉదంతాలు ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతం నుంచి పేలుళ్లు వినిపించడం కూడా సర్వ సాధారణం. అసలిక్కడ ఏముంది? పెద్ద పెద్ద నౌకలు నుండి విమానాల వరకు మాయం కావడానికి గల కారణాలు ఏంటన్నది ఎన్నో దశాబ్దాలుగా మానవాళికి సస్పెన్స్ గా మిగిలిన ప్రశ్న కాగా, తాజాగా దీనికి సమాధానాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ ప్రాంతంలో సముద్ర గర్భంగా కిలోమీటరు వెడల్పు, దాదాపు 150 అడుగుల లోతైన క్రేటర్స్ (అగ్ని బిలాలు) ఎన్నో ఉన్నాయని గుర్తించారు. వీటి అడుగు భాగం నుంచి పెద్ద ఎత్తున మిథేన్ వెలువడుతోందని, దీనికి ఉన్న మండే స్వభావం కారణంగా భారీ పేలుళ్లు జరుగుతున్నాయని గుర్తించారు. ఒకసారి మిథేన్ మండిపోయిన ప్రాంతంలో ఏర్పడే శూన్యాన్ని పూరించేందుకు సముద్ర జలాలు ఒక్కసారిగా బిలాల్లోకి దుముకుతుండటంతో, ఉపరితలంపై నీటి గుంతలు ఏర్పడి భారీ నౌకలు మునిగి పోతున్నాయని అంచనా వేసినట్లు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. విమానాలు కూలిపోవడానికి కూడా ఇదే కారణం కావచ్చని, తమ శోధనతో బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ దాదాపు వీడినట్టేనని, మరిన్ని సాక్ష్యాల కోసం ఇంకా అధ్యయనం చేయాల్సి వుందని అంటున్నారు.