Bellamkonda Sai Srinivas Sakshyam movie Poster Talkబెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ నటించిన “సాక్ష్యం” సినీమా జూన్ 14వ తేదీన విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్ ఆసక్తికరంగా ఉండడంతో, ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకుంది. అలాగే సినిమాలో ఒక పాటను విడుదల చేయగా, రెండో పాటను నేడు విడుదల చేయనున్నారు. సినిమాలో హీరో గారి ఇంట్రడక్షన్ సాంగ్ గా రూపుదిద్దుకున్న ఈ పాటలో నుండి ఓ స్టిల్ ను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ట్విట్టర్ ఖాతా నుండి విడుదల చేసారు.

సైకిల్ తొక్కుతూ గాల్లోకి ఎగిరిన ఈ స్టిల్ తన ఇంట్రడక్షన్ సీన్ లోనిదని, పోస్టర్ మాత్రమే కాదు, సినిమా కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని చెప్తూ విడుదల చేసిన ఈ స్టిల్ చూపరులను ఆకట్టుకుంటోంది. టెక్నికల్ గా ఈ సినిమా ఫుల్ సౌండింగ్ లోనే ఉంటుందన్న విషయాన్ని ఈ సినిమా టీజర్ స్పష్టం చేసింది. ‘లక్ష్యం’ ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో ప్రేక్షకులను అలరించేందుకు “సాక్ష్యం” సిద్ధమవుతోంది. ఈ సినిమా విజయంపై ‘బెల్లంకొండ అండ్ కో’ భారీ ఆశలనే పెట్టుకున్నారు.