bella-thorne -newsహాలీవుడ్ ముద్దుగుమ్మలకు చెందిన నగ్న చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ కావడం, అవి వైరల్ అవుతుండడం చాలా రొటీన్ గా జరిగే అంశాలుగా మారిపోయాయి. గతంలో ప్రముఖ హీరోయిన్ల ఫోన్లన్నీ హ్యాకింగ్ గురయ్యి, వాటిలో ఉన్న ఆయా సెలబ్రిటీల న్యూడ్ ఫోటోలు హాట్ టాపిక్ గా మారగా, తాజాగా అదే బాటలో యువనటి బెల్లా తోర్నేకు సంబంధించిన ఓ సెక్స్ టేప్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ అవుతోంది.

దీంతో సదరు ముద్దుగుమ్మ దీనిపై వివరణ ఇచ్చుకోక తప్పలేదు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, నిజానికి తాను అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదని, తనను పోలి ఉన్న మరో యువతి చేత సదరు వీడియోను రూపొందించిన క్యాష్ చేసుకుంటున్నారంటూ స్పష్టం చేసింది ఈ 19 సంవత్సరాల ముద్దుగుమ్మ. అమెరికాకు చెందిన బెల్లా టీవీ ఆర్టిస్ట్ గా, గాయనిగా ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.