befikre-official-trailer-videoఇప్పటివరకు లిప్ లాక్ పోస్టర్లతో సందడి చేసిన “బెఫిక్రే” సినిమా ప్రమోషన్ లో తాజాగా ధియేటిరికల్ ట్రైలర్ వచ్చి చేరింది. ఇటీవల విడుదల చేసిన ఓ వీడియో సాంగ్ ఈ సినిమా సిద్ధాంతాన్ని చెప్పకనే చెప్పగా, తాజా ట్రైలర్ తో పూర్తి స్పష్టత వచ్చినట్లయ్యింది. ఎలాంటి నిబంధనలు లేకుండా రొమాన్స్ చేసుకునే జంటగా రన్వీర్ సింగ్, వాణి కపూర్ లు కనిపించారు.

వీరిద్దరి మధ్య కెమిస్ట్రీనే సినిమాకు హైలైట్ గా కనపడుతోంది. హాట్ హాట్ సన్నివేశాలకు కొదవలేని ఈ సినిమా సన్నివేశాలలో ఏ మాత్రం సిగ్గు పడకుండా రన్వీర్, వాణి కపూర్ లు నటించారు. ట్రైలర్ మొత్తం కూడా పూర్తి రొమాంటిక్ సన్నివేశాలతో సాగడంతో శృంగార ప్రియులకు పండగ లాంటి సినిమాగా చెప్పుకోవచ్చు. డిసెంబర్ 9న విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా ఈ ట్రైలర్ విజయవంతం అయ్యిందనడంలో సందేహం లేదు.