befikre-million-views-in-single-dayరన్వీర్ సింగ్, వాణి కపూర్ జంటగా నటించిన “బెఫిక్రే” సృష్టించిన సంచలనం తెలియనిది కాదు. వరుసగా లిప్ లాక్ పోస్టర్లను విడుదల చేస్తూ ప్రేక్షకులలో ఆసక్తి రేపిన ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇటీవల వరుసగా వీడియో సాంగ్ లను విడుదల చేస్తూ… ఆ జంట ఎంతగా సిల్వర్ స్క్రీన్ పై చెలరేగిపోయారో చాటి చెప్తున్న చిత్ర యూనిట్, తాజాగా మరో వీడియో సాంగ్ ను విడుదల చేసింది.

“బెఫిక్రే” సినిమా యొక్క ఉద్దేశం మొత్తం ఈ టైటిల్ సాంగ్ లో చెప్పేసారు. ఫుల్ జోష్ తో కూడిన ఈ సాంగ్ ఫస్ట్ లుక్ లోనే సంగీత ప్రియులను కట్టిపడేస్తుంది. అలాగే దానికి తోడు వీడియోలో రన్వీర్, వాణిలు రెచ్చిపోయిన తీరు వీక్షకులకు కన్నుల పండుగగా మారింది. దీంతో ఒక్క రోజులోనే ఈ వీడియో సాంగ్ ఏకంగా 3 మిలియన్ క్లిక్స్ ను దాటి 4 వైపుకు పరిగెడుతోంది. హాట్ హాట్ సన్నివేశాలు, లిప్ లాక్ సీన్లతో నిండి ఉన్న ఈ సినిమా డిసెంబర్ 9వ తేదీన విడుదల కాబోతోంది.