ఒక పాట మొత్తం లిప్ లాక్ లతో చిత్రీకరించవచ్చని చాటి చెప్పే విధంగా ఉన్న పాట ఇది. రన్వీర్ సింగ్, వాణి కపూర్ జంటగా నటిస్తున్న “బెఫిక్రే” సినిమాకు సంబంధించిన తొలి పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పటివరకు ‘లిప్ కిస్’ల పోస్టర్లతో సందడి చేయగా, తాజాగా తొలి పాట కూడా దానినే అనుసరించింది. అయితే ఈ పాటలో ప్రతి ‘లిప్ లాక్’కు ఏదొక ‘థీమ్’ ఉండడం గమనించదగ్గ విషయం.
మరో విశేషమేమిటంటే… ఈ పాటలో అసలు హీరో హీరోయిన్లు కనిపించకపోవడం. అలాగే ఇద్దరు మగ వాళ్ళ, చిన్న పిల్లల లిప్ లాక్ లు కూడా ఉన్నాయి. 3 నిముషాల పాటలో మొత్తం 25 లిప్ కిస్సులు ఉండడం గమనర్హం. డిసెంబర్ 9న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను సరిగ్గా మూడు నెలల ముందు నుండి అంటే సెప్టెంబర్ 9 నుండి ప్రారంభించారు.