befikre-bollywood-film-ua-censor-certification-shockఇప్పటివరకు విడుదలైన ఫోటోలు, టీజర్, ట్రైలర్స్ తో ప్రేక్షకుల్లో ‘అడల్ట్’ సినిమాగా ముద్ర పడిన “బెఫిక్రే” సినిమా గత కొన్నాళ్లుగా సెన్సార్ సర్టిఫికేట్ కోసం వేచిచూస్తోంది. హీరోహీరోయిన్లుగా నటించిన రన్వీర్ సింగ్ – వాణి కపూర్ ల మధ్య విపరీతమైన అధర చుంభనాలు, హాట్ హాట్ సన్నివేశాలు ఉండడంతో ఈ సినిమాకు ఎలాంటి సర్టిఫికేట్ ఇస్తుందా? అని వేచిచూసిన ప్రేక్షకులకు ఒక విధంగా షాక్ తగిలినట్లయ్యింది.

అవును… ఖచ్చితంగా ‘ఎ’ సర్టిఫికేట్ లభిస్తుందని భావించిన “బెఫిక్రే”కు ‘యు/ఎ’ సర్టిఫికేట్ ను సెన్సార్ బోర్డు మంజూరు చేసింది. అది కూడా ఎలాంటి కట్స్ లేకుండా..! ఒక విధంగా ప్రేక్షకులకే కాదు, బహుశా చిత్ర యూనిట్ కు కూడా ఈ నిర్ణయం షాక్ కు గురిచేసి ఉండవచ్చు. ఈ ‘యు/ఎ’ సర్టిఫికేట్ ను మంజూరు చేసే పక్షంలో… గత కొన్నాళ్ళుగా ఈ సినిమా సెన్సార్ ను ఎందుకు పెండింగ్ లో ఉంచారు? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

అయితే తెరవెనుక ‘మంత్రాంగం’ ఏదైనా నడిచిందేమో అన్న టాక్ కూడా బాలీవుడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా ఎలాంటి కట్స్ లేకుండా సినిమా ధియేటర్ కు చేరుకోవడం వీక్షకులను కన్నుల పండుగే కదా! అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.