Beast talk Boost for KGF2“కో కో కోకిల, డాక్టర్” వంటి విజయవంతమైన సినిమాలతో ప్రామిసింగ్ డైరెక్టర్ గా పేరు గాంచిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన “బీస్ట్” సినిమా విడుదలైంది. స్టార్ హీరో విజయ్ నటించిన ఈ సినిమా ప్రేక్షకులను రంజింప చేయడంలో విఫలమైందనే టాక్ వెలువడింది.

నెట్ ఫ్లిక్స్ లో విశేష ప్రేక్షక ఆదరణ చూరగొన్న “మనీ హేస్ట్” మాదిరి కంటెంట్ తో తెరకెక్కిన “బీస్ట్,” ఆ రేంజ్ ఏమోషన్ ను పండించకపోవడమే ఈ సినిమాకు ప్రధాన మైనస్ గా మారింది. అలాగే సినిమాలో ఎక్కువగా యాక్షన్ పాళ్ళు ఉన్నప్పటికీ, అది ఆడియన్స్ మెచ్చే విధంగా లేకపోవడంతో, కొంతమేరకే యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల ఆదరణ చూరగొన్నాయి.

హీరోయిజాన్ని పీక్స్ లెవల్లో చూపించే ప్రయత్నమే కనపడింది తప్ప, అందులో ఏమోషన్ మిస్ అవ్వడంతో ఓ విధంగా యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి కారణమయ్యాయి. కామెడీ విషయంలో నెల్సన్ కు మంచి గ్రిప్ ఉందన్న విషయాన్ని, తొలి రెండు సినిమాలు “కో కో కోకిల, డాక్టర్” స్పష్టం చేసాయి. కానీ ‘బీస్ట్’లో ఆ రేంజ్ లో వినోదం పండలేదు.

క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా ఈ సినిమాకు దోహదం కాలేకపోయారు. సూపర్ హిట్ అయిన ‘హబిబో’ సాంగ్ విజువల్ గానూ బాగుంది గానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. పాన్ ఇండియా మూవీ “కేజీఎఫ్” విడుదలకు ఒక రోజు ముందు ధియేటర్లలోకొచ్చిన “బీస్ట్” తమిళనాట కొంత ప్రభావం చూపించవచ్చు గానీ, మిగిలిన ఏరియాలలో “కేజీఎఫ్”కు రూట్ క్లియర్ చేసినట్లే భావించవచ్చు.