BEACH-DRAMA--Experience-OFFICER---RGV--Nagarjunaరాంగోపాల్ వర్మ నుండి ఓ సినిమా వస్తుందంటే… విడుదలకు ముందే దాని ఫలితాన్ని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు, దానికి తగ్గట్లుగానే రిజల్ట్ ఉంటోంది. కింగ్ నాగార్జునతో తెరకెక్కించిన “ఆఫీసర్” సినిమా పరిస్థితి కూడా అందుకు విరుద్ధంగా ఏమీ లేదు. టీజర్, ట్రైలర్, వీడియో సాంగ్ ప్రోమోస్… ఇవేమీ వర్కౌట్ కాకపోవడంతో, ఏకంగా సినిమా షాట్స్ ను రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.

విశేషం ఏమిటంటే… ఇవి కూడా అవుట్ డేటెడ్ సీన్స్ మాదిరిగానే ఉండడం..! దీంతో “ఆఫీసర్” సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అన్న సందేహాలు ట్రేడ్ వర్గాల్లో నెలకొంది. ఈ సమ్మర్ లో మూడు భారీ సినిమాలు సక్సెస్ లు కాగా, ‘నా పేరు సూర్య, నేలటిక్కెట్టు’ డిజాస్టర్స్ గా మిగిలాయి. మరి “ఆఫీసర్” విజయాల గట్టున చేరుతుందో లేక డిజాస్టర్స్ గట్టున చేరుతుందో చూడాలి కానీ, ప్రేక్షకులలో మాత్రం ఇప్పటికే ఓ క్లారిటీ ఉన్నట్లుగా కనపడుతోంది.