batsman-killed-wicketkeeper-in-bangladeshక్రికెట్ లో స్లెడ్జింగ్ అనేది సర్వసాధారణం. అయితే ఈ స్లెడ్జింగ్ హద్దులు మీరితే ఎలాంటి ప్రతి ఫలాన్నిస్తాయన్నది బంగ్లాదేశ్ లో జరిగిన ఈ ఘటన తెలుపుతోంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఓ దేశవాళీ మ్యాచ్ లో నేడు ఓ ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. ఢాకా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో బాబుల్ సిక్దర్ అనే వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ‘అవుట్’ అంటూ అప్పీలు చేయడం బ్యాట్స్ మన్ కు విసుగు తెప్పించింది.

అయితే ‘నో బాల్’కు కూడా అప్పీలు చేయడాన్ని ఆ బ్యాట్స్ మన్ భరించలేకపోయాడు. కేవలం తనను రెచ్చగొట్టేందుకే కీపర్ సిక్దర్ అలా అప్పీలు చేస్తున్నాడన్న ఆగ్రహంతో వికెట్ ను పీకి అతని మెడపై పొడిచేశాడు. సూదిగా ఉండే వికెట్ అతని మెడలో దిగబడడంతో కీపర్ అక్కడికక్కడే కుప్పకూలాడు. అతనిని సహచర ఆటగాళ్లు ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఉదంతం తర్వాత బ్యాట్స్ మన్ అక్కడ నుండి పరారయ్యాడు.