bathukamma sareesఇటీవలే తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరాల పంపిణీలో అనుకోకుండా అభాసుపలు అయ్యారు. చేనేత చీరాల పంపిణీ పేరుతో నాసిరకం సూరత్ చీరలు పంపిణీ చేశారు. ఆ చేరల వేల మహాఐతే 50కి మించి ఉండదు అని అందుకున్న మహిళలు, ప్రతిపక్షాలు ఆరోపించారు.

ఆగ్రహం కట్టలు తెంచుకున్న మహిళలు వాటిని రోడ్ మీదే కాల్చివేశారు. ప్రభుత్వం మీద ఒక్కసారిగా వారి ఆగ్రహం పెల్లుబిక్కింది. ఐతే ఎప్పటిలానే అది ప్రతిపక్షల కుట్ర అని కొట్టి పడేశారు ఏలినవారు. ఆ విషయం సర్ధుమణీగాక ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెర లేపింది.

దీపావళి గిఫ్ట్‌ల పేరుతో ఢిల్లీ లోని కేంద్ర మంత్రులకు, అన్ని శాఖల సీనియర్ ఆఫీసర్లకు భారీ కానుకలు ఇస్తుంది తెలంగాణా ప్రభుత్వం. సుమారు 40000 ఖరీదు చేసే చీరలు, శేర్వానిలు పంచనున్నారు. కేంద్రమంత్రులకు స్వయంగా కేటీఆర్ వీటిని అందచేయ్యనున్నారు. మిగతవారికి టీఆరఎస్ ఎంపీలు అందించనున్నారు.

ఐతే తాము పంచిన బతుకమ్మ చీరాల విషయంలో ప్రతిపక్షాల రద్డాంతం అన్న ప్రభుత్వ పెద్దలు అవే చీరలు కనీసం కేంద్ర మంత్రులకు కాకపోయినా వారి పేషిలో ఉండే అదికారులకైన ఇవ్వగలరా? నిరుపేద మహిళలకు అలాంటి ఖరీదైన చీరలు కట్టుకోకుడాదా? ఉన్నత వర్గాలకు, లేని వర్గాలకు ఉన్న తారతమ్యాన్ని తెలంగాణా ప్రభుత్వం క్లియర్గా ఎత్తి చూపింది అనుకోవచ్చా మనం?

మరొక వైపు ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రన్న పెళ్లికానుక పేరిట నిరుపేద బీసీలకు 25 వేల నగదు, రూ.5 వేల విలువైన పట్టు చీర, పట్టు పంచె కానుకగా ఇవ్వాలని సంకల్పించారు. ఐతే ఇప్పుడుపట్టు చీర, పట్టు పంచె కానుక విరమించుకున్నారు. తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గందరగోళంగా మారిన నేపథ్యంలో రూ.30 వేలు నగదు ఇవ్వాలని నిర్ణయించారు