Bangaraju average- talkప్రతి ఏడాది ఓ రెండు, మూడు పెద్ద సినిమాలు సంక్రాంతి పండగకు పోటీపడడం, ఆ ఇద్దరు, ముగ్గురు అభిమానుల నడుమ ఓ మినీ మాటల యుద్ధాలు జరగడం… ఇలా పండగ అంతా సరదాగా గడిచిపోయేది. అలా రిలీజ్ అయిన సినిమాలలో ఫైనల్ గా ఒక సినిమాను సంక్రాంతి “విజేత”గా ప్రకటిస్తారు.

కానీ 2022 సంక్రాంతి మాత్రం రొటీన్ కు భిన్నంగా మారి, ఈ సంక్రాంతికి విజేత లేకుండా పోయారు. ఎందుకంటే అసలు పోటీ అంటూ ఉంటే ‘విన్నర్’ అనే మాట ఒకటి వస్తుంది. మరి పోటీ లేని ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు ఒక్క “బంగార్రాజు” మాత్రమే వినోదాన్ని అందించడానికి సిద్ధమయ్యారు.

‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన “బంగార్రాజు” సంక్రాంతికి కావాల్సిన కలర్ ఫుల్ హంగామాను అయితే సిల్వర్ స్క్రీన్ పైన తీసుకువచ్చాడు. సంక్రాంతి పండుగకు నిలయమైన పల్లెటూరులో జరిగే కధ కావడంతో, పండగ హంగామా సినిమాకు కలిసి వస్తుంది.

రొటీన్ కధగా తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున జోష్ ఫుల్ యాక్టింగ్, అనూప్ రూబెన్స్ అందించిన పాటలకు జరిపిన చిత్రీకరణ ప్రధాన హైలైట్స్ గా నిలిచాయి. కామెడీ ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాకపోవడం, రొటీన్ కధ కావడం మైనస్ పాయింట్స్ గా మారాయి.

విడుదలైన ఏకైక పెద్ద హీరో సినిమా కావడం, నాగార్జున – నాగచైతన్య కలిసి నటించడంతో ఈ మూడు రోజుల పండగ హంగామా అంతా “బంగార్రాజు” ఒక్కడే సొంతం చేసుకుంటాడని చెప్పడంలో సందేహం లేదు. ఎలాంటి సంక్రాంతి ఎలా అయిపోయిందో అని నిట్టూర్పును ప్రదర్శించడం ఆడియన్స్ వంతు!