Nagarjuna Akkineni - Wild Dogకింగ్ నాగార్జున సైలెంట్ తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ బంగర్రాజు పనులను ప్రారంభించాడని సమాచారం. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ సినిమా సినిమా ప్రారంభ తేదీ గురించి స్పష్టత లేకపోయినా, ఈ చిత్రం యొక్క మ్యూజిక్ సిట్టింగ్స్ చురుకైన వేగంతో జరుగుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రూబెన్స్ మరియు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ పాటల కోసం పని చేస్తున్నారట.

ఇప్పటికే వారు మూడు పాటల రికార్డింగ్ పూర్తి చేసారని అంటున్నారు. నాగచైతన్య కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చెయ్యబోతున్నాడని సమాచారం. కళ్యాణ్ కృష్ణ నాగార్జునకు, నాగచైతన్యకు పెద్ద హిట్లు ఇచ్చాడు. సోగ్గాడే చిన్ని నాయన విడుదలైన నాటి నుండీ ఈ ప్రాజెక్టు గురించి వార్తలు వస్తున్నాయి.

అయితే అనేక కారణాలతో అది వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవల అంతా ఓకే అనుకుంటున్న తరుణంలో కళ్యాణ్ కృష్ణ సోదరుడి మరణంతో సినిమా మరింత వెనక్కి వెళ్లింది. ఇప్పుడేమో కరోనా కారణంగా ఎప్పుడు మొదలు అవుతుందో తెలియని పరిస్థితి. ఈ చిత్రంలో అనుష్క, సాయి పల్లవిలను మహిళా కథానాయకులుగా భావిస్తున్నారు.

నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2016లో వచ్చిన ఊపిరి తరువాత నాగార్జున కు హిట్ అనేది లేదు. ఆయన ప్రస్తుతం తాను చేస్తున్న వైల్డ్ డాగ్ మరియు ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి!