Bandla Ganesh -PVP controversy links with ys jaganటాలీవుడ్ లోని ఒక వివాదం ఇప్పుడు రాజకీయరంగు పులుముకుని అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు తీసుకొచ్చే వరకూ వెళ్ళింది. సినీ నిర్మాత బండ్ల గణేష్ ఈరోజు ఉదయం ట్విట్టర్ వేదికగా పలు సంచలన ట్వీట్లు చేశారు. ఇటీవలే ఎన్నికలలో విజయవాడ ఎంపీ సీటు కు పోటీ చేసి ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)పై సంచలన ఆరోపణలు చేశారు.

పొట్లూరి వరప్రసాద్ తనను హత్య చేస్తాడని, తనకు రక్షణ కల్పించాలని టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్, జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. అలాగే నిన్న రాత్రి తన ఇంటిపై గణేశ్ దాడి చేశారని ఆరోపిస్తూ, పీవీపీ మరో కేసు పెట్టారు. టెంపర్ సినిమా కోసం తన వద్ద ఏడు కోట్లు అప్పు తీసుకుని అందులో కొంత ఎమౌంట్ ఎగ్గొట్టాడని పీవీపీ ఆరోపణ.

అయితే ఓడిపోయిన కేసులు కూడా మళ్లీ డబ్బులు కావాలి అని బెదిరిస్తున్నారని బండ్ల చెబుతున్నారు. ‘రాజన్న రాజ్యం వచ్చిందని ఆనందంతో బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇలాంటి దుర్మార్గుడిగా చేతినుంచి కాపాడండి సార్’ అంటూ మరో ట్వీట్ చేశారు.ఓడిపోయిన కేసులు కూడా మళ్లీ డబ్బులు కావాలి అని బెదిరించి మాట్లాడితే ఆంధ్ర ప్రదేశ్ నా చేతుల్లో ఉంది మీ అందర్నీ చంపేస్తాను అంటున్నాడని బండ్ల .. పీవీపీపై సంచలన ఆరోపణలు చేశారు.

ఇద్దరి మధ్యా గొడవ ఎలా ఉన్నా… మధ్యలో ముఖ్యమంత్రి పేరు, ప్రభుత్వాన్ని తీసుకురావడం గమనార్హం. బండ్ల గణేష్ ఆర్థికపరమైన వివాదాల్లో ఇరుకోవడం ఇదేం కొత్త కాదు. అలాగే పీవీపీ కూడా ఎన్నికలు పూర్తి అయిన నాటినుండీ చాలా దూకుడుగా వ్యవహరించడం కూడా అందరికీ తెలిసిందే. అసలు నిజానిజాలేంటో తెలియాల్సి ఉంది.