bandla-ganesh-name-not-in-the-congress-contestant-listబండ్ల గణేష్ బడా సినిమాల ప్రొడ్యూసర్ గా కంటే కూడా సినిమా ఈవెంట్లలో ఆయన పవన్ కళ్యాణ్ భక్తుడిగా, ఆయన భజన కామెడీ స్పీచ్ లకు ఆయన బాగా ఫేమస్. ఈ మధ్య ఎందుకో సినిమాలు తగ్గించిన బండ్ల రాజకీయాల వైపుకు మళ్ళారు. జనసేనకు తెలంగాణాలో ప్రాభవం లేకపోవడంతో కాంగ్రెస్ లో చేరిపోయారు బండ్ల. కాంగ్రెస్ పార్టీ నుండి రాజేంద్రనగర్, షాద్ నగర్, జూబ్లీ హిల్స్ సీట్ల లో ఏదో ఒక దానిని నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు ఆయన.

అయితే కాంగ్రెస్ 65 పేర్లతో ప్రచురించిన మొదటి లిస్టులో ఆయన పేరు లేదు. మాలి లిస్టులో అయినా స్థానం దక్కుతుందని ఆశగా ఉన్నారు బండ్ల గణేష్. ఈ లోగా ఆయన కొన్ని టీవీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఒకానొక ఇంటర్వ్యూలో హైదరాబాద్ రోడ్ల పై గుంత కనిపిస్తే వెయ్యి రూపాయిలు ఇస్తానని కేసీఆర్ ప్రకటించారని, దానికి భయపడి ప్రధాని మోడీ ఉన్నఫళంగా ఒక మీటింగు పెట్టి 1000 రూపాయిల నోట్లు రద్దు చేశారని చెప్పుకొచ్చారు గణేష్.

గణేష్ తో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆయన కామెడీని కూడా సీరియస్ గా చేస్తారు. దానితో అది ఆయన అవగాహనా లేమి గా కనిపిస్తుంది. అయితే ఇటువంటి వ్యాఖ్యలు ఈ సమయంలో టీవీ ఛానెళ్ల రేటింగ్లు పెరగడానికే గానీ గణేష్ కు ఏ మాత్రం పనికి రావు. అటు పార్టీ హై కమాండ్ కు గానీ ఇటు ఓటర్లకు గానీ ఆయన సీరియస్ పొలిటిషన్ గా కాకుండా ఒక సాధా సీదా కమెడియన్ గానే కనిపిస్తే సీటు రాదు, వచ్చినా గెలవడు. ఇది ఎంత త్వరగా తెలుసుకుంటే గణేష్ కు అంత మంచిది.