Bandi Sanjay - YS Sharmila - Padayathraతెలంగాణలో అధికార తెరాస పార్టీ కొంచెం వీక్ అయ్యిందని అనిపించగానే ప్రతిపక్ష పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన షర్మిల తన పార్టీ పేరుని ప్రకటించగానే తెలంగాణ జిల్లాలలో విస్తృతంగా ఒక పాదయాత్ర పేరిట చుట్టాలని ఆమె ఆలోచనగా ఉందట.

మరోవైపు… ఈ మధ్య కాలంలో అనూహ్యంగా బలపడిన బీజేపీ తరపున రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర చేపట్టబోతున్నారట. వచ్చే నెలాఖరులో ఈ యాత్ర ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు పార్టీ జాతీయ నాయకత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. సంజయ్‌ పాదయాత్రకు సంబంధించి రూట్‌మ్యాప్‌ కూడా రెడీ అవుతుందట.

హుజురాబాద్ ఎన్నికల వరకు పాదయాత్ర చేసి యాత్రను ఆ నియోజకవర్గం లో ఒక భారీ బహిరంగసభ తో ముగించాలని ఆలోచనట. ఇక 2023 ఎన్నికల ముందు మరో పెద్ద పాదయాత్ర చేస్తారట. ఇక మరో వైపు….తెలంగాణ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి కూడా పార్టీని బలోపేతం చెయ్యడానికి పాదయాత్ర చెయ్యాలని ఆలోచన చేస్తున్నారట.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్, అలాగే ఈ మధ్య కాలంలో చంద్రబాబు, జగన్ కూడా పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. దానితో ఈ నాయకులు కూడా పాదయాత్ర చేసి ప్రజల మనసు గెలుచుకోవాలని ఆసక్తిగా ఉన్నారు. అయితే ముగ్గురు మూకుమ్మడిగా రోడ్ల మీదకు వచ్చి జనాలను కన్ఫ్యూజ్ చేసేస్తారేమో!