Bandi Sanjay Kumar fires on KCR and YS Jaganదుబ్బాక ఉపఎన్నికల కిక్ తో ఉన్న బీజేపీ ఎలాగైనా జీహెచ్ఎంసి ఎన్నికలు గెలవాలని కృత నిశ్చయంతో ఉంది. అయితే ఆ క్రమంలో ఆ పార్టీ ఇస్తున్నా వాగ్దానాలు చిత్రవిచిత్రంగానూ ఆ పార్టీ పరువు తీసేవి గా ఉన్నవి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపికి మేయర్ పీఠం కట్టబెడితే వరద బాధితులకు రూ. 20 వేల ఆర్థిక సాయం అందిస్తాం. సర్వే చేసి, నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందిస్తాం అన్నారు అక్కడి దాకా బానే ఉంది.

ఇళ్లు కూలిపోతే ఇళ్లు కట్టిస్తాం. బైక్‌లు పోతే బైక్‌లు కొనిస్తాం.. కార్లు పోతే కార్లు కొనిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. కార్పొరేషన్ కార్లు… బైకులు కొన్నివ్వడం ఏంటో అర్ధం గాక ఆ పార్టీ వారే తలలు పట్టుకుంటున్నారు. కార్లకు బైక్లకు ఇన్సూరెన్సు ఉంటుంది. ఒకవేళ లేకపోతే అది ఇల్లీగల్. ఏ రకంగా అటువంటి వారికి బైకులు, కార్లు కొనిస్తారు?

అంతటితో ఆగలేదు… ‘‘చలాన్ల పేరిట ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. బైక్ మీద ముగ్గురు యువకులు వెళ్తే చలాన్లు విధిస్తున్నారు. బీజేపీ జీహెచ్ఎంసీ మేయర్ పదవిని చేపట్టిన తర్వాత.. భాగ్యనగర పరిధిలో వసూలు చేసిన చలాన్లను మొత్తం మేమే కడతాం. చలాన్ల కారణంగా ఎక్కువగా యువకులే ఇబ్బంది పడుతున్నారు. ఓల్డ్ సిటీలో ఎన్ని చలాన్లు వసూలు చేస్తున్నారు..? అక్కడి వాళ్లే మనుషులు.. బయటి వాళ్లు కాదా..?’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.

ట్రాఫిక్ ఉల్లంఘనలను ప్రోత్సహిస్తాం అనే విధంగా బీజేపీ మాట్లాడుతుందా? ఇటీవలే ట్రాఫిక్ ఉల్లంఘనలకు షాక్ కొట్టే విధానంగా కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది. దానిని తెలంగాణ వంటి రాష్ట్రాలు అమలు చెయ్యకుంటే… అమలు చేసేలా ఒత్తిడి కూడా చేస్తుంది. ఇప్పుడు చలాన్లను మేమే కడతాం అంటే అది తమ ప్రభుత్వంతో తామే విభేదించినట్టు కాదా?