Telangana BJP President Bandi Sanjay Kumar comments on COVID Vaccinationరాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ఎన్నికల తరువాత అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. ఎన్నికల సమయంలో తాము ఏం చేసినా ఆ తరువాత ప్రజలకు గుర్తుండదులే అనుకుంటారో ఏమో. మొన్న తెలంగాణలో జరిగిన జీహెచ్ఎంసి ఎన్నికలలో బీజేపీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డింది. హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ ఘాట్, పీవీ ఘాట్ అక్రమ కట్టడాలు అని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అన్నారు.

దానితో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెచ్చిపోయి ఎన్టీఆర్ ఘాట్, పీవీ ఘాట్ల జోలికి వస్తే నీ అంతు చూస్తాం… అంటూ రెండు ఘాట్లకు వెళ్లి వారిని పొగిడేసి దండలు వేసేసి వచ్చారు. అయితే ఎన్నికలు అయిపోయాయి బీజేపీ కావలసిన ఫలితాలు వచ్చేశాయి. బహుశా ఇక ఎన్టీఆర్ తో పనేముంది అనుకున్నారేమో ఆయన.

నిన్న ఎన్టీఆర్ 25వ వదంతి. బండి సంజయ్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వెళ్ళలేదు. కనీసం ట్విట్టర్ లో ఒక ట్వీట్ కూడా ఆయనను సమరిస్తూ వెయ్యలేదు. వికారాబాద్ లో ఒక పబ్లిక్ మీటింగ్ లో నిన్న పాల్గొన్నారు ఆయన. అక్కడ కనీసం ఎన్టీఆర్ ని ప్రస్తావించలేదు కూడా.

జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ ఘాట్ దర్శన అనేది కేవలం ఎన్నికల స్టంట్ అని… టీడీపీ మరియు సెట్లర్ల ఓట్ల కోసం చేశారని అర్ధం అయిపోయిందని రాజకీయ ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర సమితి కి చెందిన మంత్రి పువ్వాడ అజయ్ మాత్రం ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.