Balloon - Official Teaserసంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాకు తెలుగు నాట పెద్దగా సక్సెస్ లు రాలేదు గానీ, టాలెంట్ కు మాత్రం ఏం కొదవలేదని ‘శేషు, పంజా’ వంటి సినిమాల ఆడియోలు నిరూపించాయి. అలాంటి యువన్, తాజాగా “బెలూన్” సినిమాకు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాడు. అంజలి, జై జంటగా నటించిన హార్రర్ మూవీ “బెలూన్” ఫస్ట్ టీజర్ విడుదల కాగా, ఈ టీజర్ లో యువన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ హైలైట్ గా నిలవడంతో, టాక్ ఆఫ్ టీజర్ గా మారాడు.

క్లుప్తంగా ఈ సినిమా కధ గురించి టీజర్ లో స్పష్టం చేయగా, సహజంగా హార్రర్ సినిమాలకు ఉండే బ్యాక్ డ్రాపే ఈ సినిమాకు కూడా ఉందన్న విషయాన్ని ఫస్ట్ లుక్ లోనే చెప్పేసారు. అయినప్పటికీ ఆకట్టుకునే విధంగా చెప్పడంతో, ఈ టీజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు పెరిగాయి. దీనికి మరింత వన్నె తెచ్చే విధంగా యువాన్ శంకర్ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఉంది. ఈ టీజర్ విడుదల తర్వాత ఈ సినిమా తెలుగులోకి కూడా డబ్ కావడం ఖాయం అన్న నమ్మకమైతే వీక్షకులకు వచ్చేసింది.