ball-of-tournament-by-bumrah192 పరుగుల భారీ స్కోరు నమోదు చేసి కూడా టీమిండియా భయపడిందంటే… అది విండీస్ విధ్వంసం క్రిస్ గేల్ వలన అన్న విషయం తెలియనిది కాదు. తనదైన రోజున బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించే గేల్ వికెట్ మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి గేల్ వికెట్ సొంతం కావాలంటే అది అద్భుతమైన బంతి అయి ఉండాలి. మరి ఆ బంతిని ఎవరు విసిరారు..?

ఇటీవల కాలంలో చివరి ఓవర్లలో యార్కర్లు వేస్తూ ప్రత్యర్ధి బ్యాట్స్ మెన్లను కట్టడి చేస్తున్న బూమ్రా తను వేసిన తొలి బంతికే విండీస్ విధ్వంసాన్ని వెనక్కి పంపి భారత్ విజయానికి శ్రీకారం చుట్టాడు. అది కూడా బూమ్రా అమ్ముల పొదిలో దాగి ఉన్న యార్కర్ లాంటి బంతి కావడం.

వీక్షించడానికి ఫుల్ టాస్ బంతిలా కనపడుతున్నా… స్వింగ్ అయ్యే విధానంతో గేల్ ను బోల్తా కొట్టించడంలో సక్సెస్ అయ్యాడు. ఫుల్ టాస్ బంతిలా కనపడడంతో లెగ్ సైడ్ ఫ్లిక్ చేయబోయిన గేల్, ఆ బాల్ ను మిస్ చేయడంతో బంతి నేరుగా వికెట్లను తాకడంతో… లైట్లు వెలిగాయి… అటు వికెట్లలోనూ… ఇటు భారత జట్టు అభిమానుల్లోనూ..! ఈ బంతిని బూమ్రా వేయగానే ‘బాల్ ఆఫ్ ది టోర్నమెంట్’ అంటూ కామెంటర్ వ్యాఖ్యానించి తన కామెంటరీకి పూర్తి న్యాయం చేసాడు.