బాలయ్యను ఎదురుకోలేక విషప్రచారం మొదలెట్టిన సాక్షిరాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ స్థానిక ఎన్నికలను కండబలంతో గెలుచుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు పోటీ కే వెళ్లకుండా ప్రతిపక్ష అభ్యర్థులను సామాజిక వర్గాన్ని ప్రేరేపించి.. ప్రలోభాలకు గురిచేసి.. కేసులతో భయపెట్టి నామినేషన్లు విత్ డ్రా చేయిస్తున్నారు. అటువంటివి ఎక్కువగా ఉండటంతో అసలు ఎన్నికలు జరిగిన చోట తక్కువ వచ్చినా ఏకగ్రీవాలతో కలిపి ఎక్కువ గెలుపులు చూపించుకుంటున్నారు.

పంచాయతీ ఎన్నికలలో సక్సెస్ అయినా ఈ వ్యూహాన్ని మునిసిపల్ ఎన్నికలలో కూడా అమలు చేస్తున్నారు. అన్ని చోట్లా ఫలించిన ఈ వ్యూహం హిందూపురంలో మాత్రం ఫెయిల్ అయ్యింది. బాలయ్య పటిష్ట వ్యూహం కారణంగా ఈ పురపాలక సంఘంలోని 38 వార్డుల్లోనూ వైసీపీ అభ్యర్థులకు దీటుగా టీడీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు.

దీనితో సాక్షి బాలయ్య మీద మరోసారి విరుచుకుపడే ప్రయత్నాలు మొదలుపెట్టింది. నామినేషన్ల విత్ డ్రా టైం పూర్తయిన దగ్గర నుండీ పురంలో బాలయ్య రోడ్ షోలు జనం లేక వెలవెలబోతున్నాయని… బాలయ్య స్థానిక నేతలను తిట్టారు అంటూ వరుసగా కథనాలు వండి వారుస్తుంది.

కేవలం పురంలో తమ పాచిక పారలేదు అనే అక్కసుతోనే బాలయ్య మీద దాడి మొదలుపెట్టారని టీడీపీ అభిమానులు అంటున్నారు. అయితే తమ గెలుపే వారికి సమాధానం చెబుతుందని… పురం మునిసిపాలిటీ మీద పసుపు జండా ఎగురవేయడం ఖాయమని వారు అంటున్నారు.