balakrishnaతెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలాసాని శ్రీనివాస్ యాదవ్‌తో, తరువాత సిఎం కెసిఆర్‌తో సమావేశానికి తనను ఆహ్వానించలేదని హీరో బాలకృష్ణ టాలీవుడ్ పెద్దల‌పై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలయ్య కామెంట్లతో పరిశ్రమ ఒక్కసారి ఉలిక్కిపడింది.

బాలకృష్ణ నాగబాబు గట్టిగా వ్యాఖ్యలు చేసినా, సినీ పెద్దలు మాత్రం బాలయ్యని పిలిచి ఉండాల్సిందే అని అభిప్రాయపడ్డారు. దీనితో బాలయ్యను శాంతింపజేసే ప్రయత్నంలో, సీనియర్ నటులు మరియు చిత్రనిర్మాతలు బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ సిఎం వైయస్ జగన్‌తో సమావేశానికి ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో, ఈ బృందం జూన్ 9 న మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ సిఎంను కలుస్తుంది. దాని కోసం వారంతా అమరావతి వెళ్ళబోతున్నారు. ఈ సమావేశానికి బాలయ్య హాజరవుతారా లేదా అనే దానిపై అందరి దృష్టి ఉంటుంది.

బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అందులోనూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు. రాజకీయాలకు అతీతంగా బాలయ్య హాజరు అయితే అది మంచిది. ఈ సమావేశం సందర్భంగా ఈ మధ్య వచ్చిన స్పర్ధల కారణంగా బాలయ్య, చిరంజీవి ఎలా ఉంటారో కూడా చూడాలి.