balakrishna thigh slap train scene  explanationనందమూరి నటసింహం ప్రస్తుతం మాంచి జోష్ లో ఉన్నాడు. “డిక్టేటర్” ఇచ్చిన ఊపుతో మీడియా వర్గాలకు ఇంటర్వ్యూలిస్తూ సందడి చేస్తున్న బాలకృష్ణ, తాజాగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన “పలనాటి బ్రహ్మనాయుడు” సినిమాలోని సన్నివేశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

“ఇలా అంటే ట్రైన్ వెళిపోతుంది… మా వాళ్ళు కూడా అడుగుతారు… ఇలా అంటే ట్రైన్ వెళ్ళిపోవడమేంటి… నాకు అప్పుడప్పుడు ఇదిగా అనిపిస్తుంది… ఎందుకు అనుకున్నాం అపుడు… షూట్ చేసినపుడు అనిపించలా… ఆ వేడిలో ఉన్నాం… క్యారెక్టర్ మూడ్ లో ఉన్నాం… ఓ పది మంది అన్నాకే అనిపించింది… అవును నిజమేగా… ఇలా అంటే ట్రైన్ వెళ్ళిపోవడమేంటి… తోడ కొట్టి ఇలా అంటే…” అని చెప్తూ బాలకృష్ణ నవ్వులు పూయించారు.

ఈ సందర్భంగా యాంకర్ కాస్త కవర్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ…. మీరు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి… అది మరీ టూ మచ్… డైరెక్టర్ ఎందుకు అడిగారో… నేనెందుకు ఒప్పుకున్నానో… అంటూ బాలయ్య చెబుతుంటే యాంకర్ సీట్లో కూర్చోవడానికి (నవ్వలేక…) ఇబ్బందులు పడ్డారు.

బాలయ్య అంటే ఒక చిన్నపిల్ల వాడని సినీ ఇండస్ట్రీతో పాటు బాలయ్య సన్నిహితులు కూడా చాలా సందర్భాలలో చెప్పారు. ఈ అనుభూతులను చూస్తే నిజంగా అదే అనిపించక మానదు. ముఖ్యంగా బాలకృష్ణ ఉన్న పోసిషన్ లో మరే అగ్ర నటుడు ఈ విధంగా తన తప్పులను ఒప్పుకోరేమో! నిజానికి ఆ సన్నివేశం చెప్తూ ఇపుడు బాలయ్య ఎలా ఎంజాయ్ చేసారో, సినిమాలో ప్రేక్షకులు చూస్తున్న సమయంలో కూడా అలాగే ఎంజాయ్ చేసారు… నవ్వుతూ..!