Balakrishna skipped telugu film industry meeting with ys jaganతెలంగాణ ప్రభుత్వంతో చిత్ర పరిశ్రమ సమావేశాలకు ఆహ్వానించకపోవడంతో బాలయ్య చేసిన కామెంట్లు సంచలనం సృష్టించాయి. బాలకృష్ణ విస్ఫోటనం తరువాత, నాగబాబు కూడా తీవ్రంగా స్పందించారు. ఈ విషయంగా చిత్ర పరిశ్రమ రెండుగా విడిపోయింది. బాలయ్యని సమర్ధించే వారు కొంతమంది కాగా, చిరంజీవి వర్గాన్ని కొందరు వెనకేసుకొని వచ్చారు.

ఇదిలావుండగా, పరిశ్రమ పెద్దలు ఈ నెల 9 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు. వారి అప్పోయింట్మెంట్ కూడా కంఫర్మ్ అయ్యింది. బాలయ్యను కూడా ఆహ్వానించారని సమాచారం. అయితే, మరుసటి రోజు తన పుట్టినరోజు అని, అతను బిజీగా ఉంటాడని బాలయ్య వారితో నో చెప్పాడట.

ఈ విషయాన్ని తెలుగు ప్రొడ్యూసర్స్ యూనియన్ అధిపతి సి కళ్యాణ్ వెల్లడించారు. బాలయ్య, జగన్ ప్రత్యర్థి రాజకీయ పార్టీలలో ఉన్నారన్న విషయం తెలిసిందే. బాలయ్య హిందూపూర్ నుండి టిడిపి ఎమ్మెల్యే. ఇటీవల జరిగిన మహానాడులో బాలయ్య కొన్ని ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం ఎక్కువకాలం నిలబడదు అన్న విధంగా కూడామాట్లాడారు.

కాబట్టి, అనవసరమైన రాజకీయ వివాదాలను నివారించడానికి ముఖ్యమంత్రిని కలవడానికి ఆయన ఇష్టపడి ఉండరు. అయితే సరిగ్గా ఇటువంటి రాజకీయాల కారణంగానే గతంలో కేసీఆర్ తో మీటింగ్ కు బాలయ్యని పిలవలేదని. ఆయన కోప్పడటంలో న్యాయం లేదని తేలిపోయిందని కొందరు చెప్పుకొస్తున్నారు.