balakrishna-shirtless stadiumనందమూరి నటసింహం ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. సరదా మాటలకు, చేష్టలకు నిలయంగా నిలిచే బాలయ్య బాబు తాజాగా షర్టు లేకుండా దర్శనమిచ్చారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా కోసం మేకోవర్ అవుతున్న లుక్ లో బాలయ్య షర్ట్ లెస్ గా కనిపించి అభిమానుల చేత విజిల్స్ వేయించుకుంటున్నారు.

ఈవెంట్ ఏదైనా ఎంజాయ్ చేయడంలో బాలయ్య తర్వాతే మరో హీరో అన్న రీతిలో కనపడుతున్న బాలయ్య ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. షర్ట్ లెస్ లుక్ లో బాలయ్య మెడలో ఉన్న తాయిత్తులు బహుశా మరే హీరో వద్ద జీవిత కాలంలో కూడా చూడలేమోమో! మొత్తానికి అభిమానుల చేత ‘బాలయ్య బాబా… మజాకా..!’ అనిపిస్తున్నారు ఈ నందమూరి నటసింహం.