No-Politics-in-Balayya-Ruler2019 సంవత్సరం నందమూరి బాలకృష్ణ కేరీర్ లోనే అత్యంత నిరాశాజనకమైన సంవత్సరంగా మిగిలిపోనుంది. ఈ ఏడాది బాలయ్య నుండి మూడు సినిమాలు వచ్చాయి. సంవత్సరం మొదట్లో వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు భారీ హైప్ మధ్య విడుదలైనా పూర్తిగా నిరాశపరిచాయి.

ఈ శుక్రవారం విడుదలైన రూలర్ మొదటి రోజు మొదటి ఆట నుండే పూర్తిగా ప్లాప్ టాక్ తో మొదలయ్యింది. రెండో రోజైన ఈరోజే కొన్ని సెంటర్లలో ఆ సినిమాను తీసేసి సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతి రోజూ పండగే వేసుకోవడం గమనార్హం. దీనితో ఈ సినిమాతో బాలయ్య హాట్ట్రిక్ డిజాస్టర్లు నమోదు చేసినట్టే.

అయితే ఈ సంవత్సరంలో బాలయ్య అభిమానులకు దక్కిన గుడ్ న్యూస్లు ఏమైనా ఉంటే అది బాలయ్య హిందూపూర్ ఎమ్మెల్యేగా రెండో సారి గతంలో కంటే మెరుగైన మెజారిటీ తో గెలవడం. అదే సమయంలో తన తదుపరి చిత్రంగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఒక సినిమాను అధికారికంగా ప్రకటించడం.

సింహా – లెజెండ్ సినిమాలతో బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ కి ఎంతగా క్రేజ్ వచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ హీరోయిజాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి. ఇప్పుడు వారి కాంబినేషన్ లో కావడంతో ఈ సినిమా మీద అంచనాలు బాగా ఉన్నాయి. 2020 వేసవి చివరి భాగంలో విడుదలకు సన్నాహాలు చేస్తుంది చిత్రబృందం.