Ruler Movie Trailer Talkనందమూరి బాలకృష్ణ – జైసింహా ఫేమ్ కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం ‘రూలర్’ డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల అవుతుంది. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కాసేపటి క్రితం విడుదల అయ్యింది. ట్రైలర్ అవుట్ డేటెడ్ గా ఉందని అభిమానులు కూడా పెదవి విరిచేలా ఉండడం గమనార్హం.

ట్రైలర్ లో సగం పైగా బాలయ్యను చూపించకుండా కానిచెయ్యడం జరిగింది. ఇప్పటికే బాలయ్య పోలీసు గెట్ అప్ లో వాడిన విగ్ మీద విమర్శలు రావడంతో ట్రైలర్ లో బాలయ్య ను ఎక్కువగా చూపించలేదు అని కొందరు అంటున్నారు. రైతులకోసం పోరాడే ఒక యోధుడి కథగా రూలర్ అనిపిస్తుంది. అయితే ప్రేక్షకులు సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

సాయి ధరమ్ తేజ్ – మారుతిల ప్రతి రోజు పండగే కూడా డిసెంబర్ 20నే విడుదల కాబోతుంది. కార్తీ నటించిన తంబీ చిత్రం తెలుగులో దొంగగా రాబోతుంది. కార్తీ ఇటీవలే ఖైదీ వంటి పెద్ద హిట్ ఇవ్వడంతో ఈ సినిమాపై ట్రేడ్ కు బానే ఆసక్తి ఉంది. ఇది ఇలా ఉండగా సురేష్ డిస్ట్రిబ్యూటర్స్ సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 చిత్రం తెలుగు వెర్షన్ ను రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సహజంగా సల్మాన్ ఖాన్ సినిమాలకు ఉండే హైప్ ఈ సినిమాకు కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా హాలీవుడ్ నుండి కూడా ఒక పెద్ద సినిమా అదే రోజున విడుదల కావడానికి బయలుదేరింది. స్టార్ వార్స్ – ది రైస్ అఫ్ స్కైవాకర్ ఆ రోజు విడుదల కాబోతుంది. ఇన్ని సినిమాల మధ్య రూలర్ కు సరైన టాక్ రాకపోతే నిలబడటం ఇబ్బందే.