balakrishna remuneration in Ruler నందమూరి బాలకృష్ణ కే ఎస్ రవికుమార్ కాంబినేషన్ తెరకెక్కుతున్న రెండో సినిమా ‘రూలర్’. ఈ చిత్రానికి సంబంధించిన రెండు పోస్టర్లు దీపావళి సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. అయితే వీటికి నెగటివ్ రెస్పాన్స్ రావడం, ముందు నుండే ఈ కాంబినేషన్ పై పెద్దగా ప్రేక్షకులలో ఆసక్తి లేకపోవడంతో సినిమా మీద నీలినీడలు కమ్ముకున్నాయి.

అయితే ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే అయినట్టు సమాచారం. గతంలో ఇదే నిర్మాత సి కళ్యాణ్ బాలయ్యతో జై సింహా అనే సినిమా చేసినప్పుడు కేవలం ఆరు కోట్లు ఇచ్చాడట రెమ్యూనరేషన్ గా, ఈ సినిమాకు మాత్రం బాలయ్య 12 కోట్లు డిమాండ్ చేసి దక్కించుకున్నాడట. జై సింహా తరువాత ఒక్క హిట్ కూడా లేకపోయినా బాలయ్య రెమ్యూనరేషన్ డబల్ చెయ్యడం విశేష,

దీనితో ఈ సినిమా టార్గెట్ కూడా ఎక్కువగానే ఉండబోతుంది. డిసెంబర్ 20న క్రిస్మస్ సంధర్భంగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. క్రిస్మస్ బరిలో రవితేజ డిస్కో రాజా, సాయిధరమ్ తేజ్ ప్రతి రోజు పండగే సినిమాల నుండి గట్టి పోటీ ఎదురుకోబోతుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తో సినిమా మీద బజ్ ఏమైనా పెరుగుతుందేమో చూడాల్సి ఉంది.

సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, భూమిక చావ్లా, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలయ్య వందవ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణికి స్వరాలు కూర్చిన చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా.. రామ్‌ప్రసాద్ కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు.