Balakrishna pressure on boyapati sreenu ఇప్పుడు నందమూరి అభిమానుల్లో వినయ విధేయ రామ ఫ్లాప్ అయినందుకు ఎంత హ్యాపీనో..అదే క్రమంలో బోయపాటి తన తర్వాత మూవీ బాలయ్యతోనే అని అంత టెన్షన్ లో ఉన్నారు. అయితే ఎన్ఠీఆర్ బయోపిక్ ఆడియో వేడుకలోనే బాలయ్య బోయపాటితో సొంత బ్యానర్ లో సినిమా ఉంటుంది అని అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే కదా..

అయితే మరో పక్క అనిల్ రావి పూడితో కూడా బాలయ్య ఒక సినిమా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వచ్చిన తరుణంలో ఇప్పుడు ఫాన్స్ అంతా బాలయ్య వినయ విధేయ రామ లాంటి డిజాస్టర్ ఇచ్చిన బోయపాటిని పక్కన పెట్టి, ఎఫ్-2 తో మంచి సక్సెస్ ను ఇచ్చిన అనిల్ రావిపూడితో సినిమా చెయ్యాలని ఆశిస్తున్నారు.

అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే బోయపాటి సింహా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దమ్ము సినిమాతో కాస్త నిరాశపరిచాడు. అయినా బాలయ్య నమ్మి లెజెండ్ అవాకాశం ఇచ్చాడు…అలాగే ఒక సినిమా పోయినంత మాత్రం మరో సినిమాపై ఆ ఎఫెక్ట్ ఉంటుంది అని ఎలా అనుకుంటాం.

అదే క్రామంలో అనిల్ రావి పూడి హిట్స్ లో ఉన్నాడు కనుక బాలయ్యకి హిట్ ఇవ్వగలడు అని ఎలా అంచనా వెయ్యగలం. పైగా అనిల్ స్కూల్ అంతా కామెడీ పాఠాలే. ఆ కామెడీ పాఠాలు బాలయ్యకి సెట్ అవుతాయా? అవన్నీ తెలిసే నందమూరి ఫాన్స్ అనిల్ తో సినిమా అంటూ ఎందుకు పట్టుబడుతున్నారో మరి?