Balakrishna-Pawan-Kalyan-Nandyal-By-Election.jpgనంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అభ్యర్థిని గెలిపించుకుని ప్రజలు తమ వెంటే ఉన్నారన్న సంకేతాలను పంపాలని భావిస్తున్న వైకాపా, అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారన్న నినాదంతో తెలుగుదేశం పార్టీలు ప్రచారంలో ముందుకు సాగుతున్న వేళ, సినీ గ్లామర్ ను కూడా జోడించాలని టీడీపీ నిర్ణయించింది. రాయలసీమ ప్రాంతంలో అమితమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి బాలకృష్ణను కనీసం మూడు నుంచి నాలుగు రోజుల పాటు ప్రచారం నిమిత్తం తీసుకురావాలని తెలుగుదేశం భావిస్తోంది.

ఇందుకు బాలయ్య కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే బాలయ్యతో పాటు 2014లో తమకు అనుకూలంగా ప్రచారం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కూడా నంద్యాలలో తమ తరఫున పోటీ చేసే అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసేలా చూడాలని భావిస్తోంది. మరికొద్ది నెలల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్న నేపధ్యంలో… ప్రచారానికి వచ్చే అవకాశాలు లేకపోవడంతో, కనీసం మీడియా ముఖంగానైనా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికేలా పిలుపునివ్వాలని టీడీపీ అధిష్ఠానం యోచనని సమాచారం.