సరైన సమయంలో బాలయ్య స్పందించడం వల్ల సరిపోయింది

NTR Mahanayakudu – Redemption Or Further Destruction In Store?క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఎట్టకేలకు విడుదల కాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈనెల 22 న విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను కూడా అతి త్వరలో విడుదలచేయనున్నారు. మొదటి పార్ట్, ఎన్టీఆర్ కథానాయకుడు ఫెయిల్యూర్ తో రెండవ భాగం ను ఎలాంటి హడావుడి లేకుండా విడుదలచేస్తున్నారు.

అయితే ఉన్నఫళంగా ఈరోజు ఆ చిత్రం గురించి నెగటివ్ వార్తలు హల్ చల్ చేశాయి. నష్టపోయిన బయర్లకు అండగా నిలబడటానికి బాలకృష్ణ ముందుకు రావడం లేదని దీనితో కథానాయకుడు బయర్లు మహానాయకుడికి దూరంగా ఉండటానికి నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ మీద గౌరవంతో పెట్టుబడి పెట్టిన వారిని నిండా ముంచారని విమర్శలు వచ్చాయి. దీనితో బాలయ్య ఒక్కసారిగా జాగ్రత్త పడ్డారు. బయర్లను పిలిచి మాట్లాడారు. సాయంత్రానికి విషయం సర్దుమణిగింది.

కథానాయకుడు బయర్ల ద్వారానే మహానాయకుడు విడుదల చెయ్యాలని నిర్ణయించారు. కథానాయకుడు నష్టాలలో 33% వరకు బాలయ్య భరించడానికి ముందుకు వచ్చారు. అలాగే రెండవ పార్ట్, మహానాయకుడికి వచ్చే రెవిన్యూలలో 40% అదే బయర్లకు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. దీనితో నష్టపోయిన వారు ఊపిరి పీల్చుకున్నారు. వారంతా బాలయ్య కు రుణపడి ఉంటాం అంటున్నారు. సరైన సమయంలో బాలయ్య స్పందించడం వల్ల సరిపోయింది గానీ లేకపోతే దీనిలో ఎన్టీఆర్ పేరు బద్నామ్ అయ్యేది.

Follow @mirchi9 for more User Comments
Pawan-Kalyan - YS-Jagan-Don't MissYSR Congress Not To Spare Pawan Kalyan Despite Being A Partner of BJP?Ruling YSR Congress Party seems to be trying to fire salvos on Janasena President Pawan...Prabhas' Screen Mother Bhagyashree Calls It Heaven on EarthDon't MissPrabhas' Mother Calls It Heaven on Earth1989 & 90 were the years when Bhagyashree's name was on everyone's tongue as the...Disco Raja Movie Review -Don't MissDisco Raja Review -Sci-Fi Coated Routine Revenge DramaBOTTOM LINE Sci-Fi Coated Routine Revenge Drama OUR RATING 2.25/5 CENSOR UA - 2 hrs...High Court Directs Government Not To Shift Offices to VishakapatnamDon't MissHigh Court Directs Government Not To Shift Offices to VishakapatnamIn what can be termed as another jolt to YS Jagan Mohan Reddy Government, Andhra...Naga Shaurya Trying Hard for ItDon't MissNaga Shaurya Trying Hard for ItNaga Shaurya's next movie 'Ashwathama' is releasing on 31st January and it seems that the...
Mirchi9