balakrishna next movie without wigనందమూరి బాలకృష్ణ ఇటీవలే కాలంలో గుండు చేయించుకుని కనబడుతున్నారు. దాని మీద రకరకాల ఊహాగానాలు జరిగాయి. ఆయన హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకోబోతున్నారు అని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అదేమి లేదని బాలయ్య బోయపాటి సినిమాలో ఇదే లుక్ లో కనిపించబోతున్నారని చెబుతున్నారు.

బాలయ్య విగ్ లేకుండా నటించడం ఇదే మొదటి సారి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరు నుండి వారణాసిలో మొదలవుతుందని సమాచారం. గతంలో బోయపాటి జయజానకి నాయక సినిమాను నిర్మించిన మిర్యాల రవీంద్రరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కేరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రంగా రూపొందించనున్నారు.

సింహా – లెజెండ్ సినిమాలతో బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ కి ఎంతగా క్రేజ్ వచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ హీరోయిజాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి. ఇప్పుడు వారి కాంబినేషన్ లో కావడంతో ఈ సినిమా మీద అంచనాలు బాగా ఉన్నాయి.

ఈ చిత్రంలోని హీరోయిన్లు ఇంకా కంఫర్మ్ కాలేదు. జులై 31న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలయ్య ఈ మధ్య కాలంలో వరుసగా మూడు ప్లాపులు ఇచ్చారు. బోయపాటికి కూడా సరైనోడు తరువాత హిట్ లేదు. దీనితో ఈ సినిమా హిట్ కావడం ఇద్దరికీ కీలకం.