Balakrishna - VV Vinayakనందమూరి బాలకృష్ణ వీవీ వినాయక్ కాంబినేషన్ లో ఎప్పుడో 2002లో చెన్నకేశవరెడ్డి అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా అందులో పెద్ద బాలయ్య గెట్ అప్ ఇప్పటికీ బాలయ్య అభిమానుల ఫేవరెట్. మళ్ళీ ఇంత కాలం తరువాత వారిద్దరి కాంబినేషన్ లో ఇంకో సినిమా రాబోతుంది.

పరుచూరి బ్రదర్స్ దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారట. ఈ చిత్రానికి ఏకే-47 అనే పవర్ ఫుల్ టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. వచ్చే సంవత్సరం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది. బాలయ్య వచ్చే నెలలో ఎన్టీఆర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఎన్టీఆర్ అనే సినిమా చెయ్యబోతున్నారు.

గతంలో బాలయ్యకు గౌతమీపుత్ర శాతకర్ణి వంటి అతిపెద్ద హిట్ ఇచ్చిన క్రిష్ దీనికి దర్శకత్వం వహించబోతున్నారు. ఎన్టీఆర్ తరువాత బాలయ్య వినాయక్ సినిమా తెరకెక్కబోతుంది. ప్రస్తుతానికి వినాయక్ పేలవమైన ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఆయన ఈ చిత్రానికి కసిగా పని చెయ్యబోతున్నట్టు సమాచారం.