నందమూరి బాలకృష్ణ ఈ నెల 10 న తన పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్న దానిని బట్టి … ఆ రోజు బాలయ్య నుండి నుండి అభిమానులు పలు సప్రైజ్లు రాబోతున్నాయట. అఖండ బృందం తమ సినిమాలోని ఒక స్పెషల్ పోస్టర్ తో బాలయ్య అభిమానులను అలరించబోతుందట. ఈ సినిమా కోవిడ్ సెకండ్ వేవ్ లేకపోతే ఈ పాటికే విడుదల కావాల్సింది.
లాక్‌డౌన్‌కు ముందు విడుదల చేసిన టీజర్‌కు సంచలనాత్మక స్పందన వచ్చిన తరువాత, అభిమానులు ఈ చిత్రం పై చాలా ఆశలే పెట్టుకున్నారు. బాలయ్యతో క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని చిత్రం జూన్ 10 న ప్రకటించబడుతుందని వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపుడితో కలిసి బాలయ్య చేసే మరో చిత్రం కూడా అదే రోజున ప్రకటించే అవకాశం ఉందట.
బాలకృష్ణ కు 2018లో వచ్చిన జై సింహ తరువాత హిట్ అనేది లేదు. ఆ తర్వాత మూడు చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దానితో . కాబట్టి, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మునుపటి రెండు చిత్రాలు అప్పటికి బాలకృష్ణ కెరీర్‌లో అతిపెద్ద హిట్‌లు.
ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల బర్త్ డేలు అన్నీ సాదాసీదాగా సాగిపోతున్నాయి. ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు సంబరాలు కరెక్ట్ కాదని సినిమా ప్రమోషన్లు వాయిదా వేస్తున్నారు. అయితే పరిస్థితి కొంచెం చక్కబడంతో బాలయ్య సినిమా సందడి మొదలుపెట్టబోతున్నాడు. మొత్తానికి జూన్ 10 నుండి ఇండస్ట్రీకి కొంత కళ వస్తుంది.