Balakrishna-KS-Ravi-Kumar-Movie-Cancelledచంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరుతో చంద్రబాబు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారు అంటూ రామ్ గోపాల్ వర్మ తో ఒక సినిమా తీయించారు వైఎస్సార్ కాంగ్రెస్ వారు. ఆ సినిమాకు వైఎస్సార్ కాంగ్రెస్ నేత రాకేష్ రెడ్డి నిర్మాతగా ఉన్నారు. ఎన్నికల సందర్భంగా కోర్టు ద్వారా ఆ సినిమా విడుదలను టీడీపీ అడ్డుకున్నా ఎంతోకొంత నష్టమైతే ఆ సినిమా చేసిన మాట వాస్తవమే. ప్రతిపక్షంలో ఉండి ముఖ్యమంత్రి మీద సినిమా తీయడం అనేది సాహసమే.

అయితే వస్తున్న వార్తల ప్రకారం…. నందమూరి బాలకృష్ణ కేఎస్ రవికుమార్ సి కళ్యాణ్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళకముందే అటకెక్కిందని సమాచారం. ఫిలింనగర్ లోని గుసగుసల బట్టి ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా డబుల్ రోల్ చేస్తున్నారు. ఈ రెండు పాత్రలలో జగపతిబాబు తాత, మనవడిగా కనిపిస్తారని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో తాత విలన్. తరువాత మనవడు విలన్. ఈ రెండు విలన్ క్యారెక్టర్లు కూడా వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జగన్ లు స్ఫురించేలా రాసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది గనుక ఇటువంటి సినిమా తీయడం రిస్క్ అని మొత్తానికి విరమించుకున్నారట. ఈ వార్తలన్నీ నిజమో కాదో తెలీదు గానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు మాత్రం దీని మీద కినుక వహించారు. అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ వారికి ఉన్న ధైర్యం మీకు లేకపోయిందా అని వారు ప్రశ్నిస్తున్నారు. మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని చెప్పుకునే బాలయ్యే వెనుకడుగు వేస్తే ఇంక ప్రతిపక్షంలో టీడీపీ ఎలా మనగలుగుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.