Balakrishna- Jr NTRనందమూరి నటసింహం బాలకృష్ణ – యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ఆ కిక్కు మాటలకందని రూపంలో ఉంటుందన్నది నందమూరి అభిమానుల మాట. మరి నిజంగానే ఈ ఇద్దరు నందమూరి హీరోలు కలిసి చేస్తున్నారా? అంటే…

Also Read – అధికారం కోసం చిచ్చు పెట్టడం నైతికమేనా… ఏ-1, ఏ-2?

ప్రస్తుతానికి ఇది ‘ఫాంటసీ’ రూపంలోనే ఉంది. కానీ భవిష్యత్తులో ఈ కాంబోలో ఓ సినిమా రావొచ్చు అన్న నమ్మకాన్ని “అఖండ” ప్రీ రిలీజ్ ఈవెంట్ కలిగించింది. తన ‘అఖండ’ సినిమాతో పాటు త్వరలో రాబోతున్న ‘పుష్ప’ సినిమా హిట్ అవ్వాలని కోరుకున్న బాలయ్య, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి కూడా ప్రస్తావించారు.

తమ్ముడు రామ్ చరణ్ మరియు మన జూనియర్ ఎన్టీఆర్ కలిసి చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ కూడా బంపర్ హిట్ అవ్వాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. ముఖ్యంగా ‘మన జూనియర్ ఎన్టీఆర్’ అన్న మాటతో నందమూరి అభిమానుల హర్షంతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా కావాలంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

Also Read – ఓ గబ్బర్ సింగ్, ఓ పుష్పరాజ్‌.. మరిచిపోలేని పాత్రలే!


ఒకవేళ కార్యరూపం దాలిస్తే మాత్రం టాలీవుడ్ లో అత్యంత క్రేజీ మల్టీస్టారర్ గా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. అభిమానుల ‘ఫాంటసీ’గా మారిన ఈ క్రేజీ కాంబో గురించి తెలుగు దర్శకులు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని ఆశిద్దాం. బహుశా బోయపాటే అందుకు శ్రీకారం చుడతారేమో చూడాలి.