balakrishna Jai Simha better than Pawan Kalyan Agnyaathavaasiత్రివిక్రమ్ మరియు పవన్ కెరీర్లలో ఏ సినిమాకు రానన్ని విమర్శలతో “అజ్ఞాతవాసి” మునిగి తేలుతోంది. బాక్సాఫీస్ వద్ద రెండవ రోజు పరిస్థితిని గమనిస్తే… ఇక ఈ సినిమా కోలుకోవడం కష్టమనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సంక్రాంతికి “అజ్ఞాతవాసి”తో పాటు నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన “జై సింహా” కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కనీసం ఈ సినిమా అయినా సినీ ప్రేక్షకులను అలరించే విధంగా ఉందా? ఇప్పటికే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలతో పాటు రెగ్యులర్ షోలు కూడా పడిపోవడంతో, ప్రేక్షకుల నుండి ‘ఫస్ట్ టాక్’ బయటకు వచ్చేసింది. మరి “అజ్ఞాతవాసి” కంటే బెటర్ టాక్ ను సొంతం చేసుకుందా? లేక దాని కంటే దారుణమైన టాక్ లభించిందా? అన్నది పవన్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నిజానికి “జై సింహా”పై ఎలాంటి అంచనాలు లేవు. నందమూరి అభిమానులు కూడా పెద్దగా ఆశలు పెట్టుకుంది లేదు. మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుని విడుదలైన ఈ సినిమా పూర్తిగా కాకపోయినా, ఎంతో కొంత మాస్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యిందనే టాక్ లభించింది. ముఖ్యంగా ‘అమ్మ కుట్టి’ వంటి పాటలలో ఈ వయసులో బాలకృష్ణ వేసిన స్టెప్పులకు నందమూరి అభిమానులే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. అయితే రొటీన్ కొట్టుడును తట్టుకోలేని ప్రేక్షకులు మాత్రం “జై సింహా”ను భరించడం కాస్త కష్టమైన విషయమే అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తమ్మీద ‘అజ్ఞాతవాసి’తో పోల్చుకుంటే, కనీసం టార్గెట్ ఆడియన్స్ ను అయినా సంతృప్తి పరచడంలో “జై సింహా” ఒక మెట్టు పైన నిలిచింది.

ఓవరాల్ గా చెప్పాలంటే… ఈ రెండు సినిమాలతో ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న మరో చిత్రం “రంగుల రాట్నం”కు ఖచ్చితంగా ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. 14న విడుదల అవుతోన్న ఈ సినిమా అయినా ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచుతుందని ఆశిద్దాం. 2018 సంవత్సరం సంక్రాంతి టాలీవుడ్ కు తీరని క్షోభను మిగిల్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో అందరి చూపులు రిపబ్లిక్ డే వైపుకు మళ్ళాయి. అనుష్క “భాగమతి,” మంజుల “మనసుకు నచ్చింది,’ మంచు విష్ణు “ఆచారి అమెరికా యాత్ర”తో సహా మరో రెండు, మూడు సినిమాలు ఇప్పటికే తమ డేట్స్ ను ప్రకటించాయి. దీంతో సంక్రాంతి ఎంటర్టైన్మెంట్ కాస్త రిపబ్లిక్ డేకు షిఫ్ట్ అయినట్లు కనపడుతోంది.