Balakrishna-Dictator-director sriwasఅన్ని హంగులు పూర్తి చేసుకుని జనవరి 14న ధియేటర్లలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న “డిక్టేటర్” కోసం నందమూరి అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదలకు రోజులు లెక్క పెడుతున్న ప్రస్తుత తరుణంలో… “డిక్టేటర్”కు సంబంధించిన ఒక్కో విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ సినిమా సంగతులను, కొంత స్టోరీని ఇప్పటికే చెప్పిన బాలయ్య నటించిన ఓ సన్నివేశం సోషల్ మీడియా సంక్రాంతి కోడై కూస్తోంది.

ఈ సినిమాలో హీరో పేకాట ఆడే సన్నివేశం ఉండగా, దీనికి గానూ మంచి రిచ్ కార్డులు కావాలని డైరెక్టర్ శ్రీవాస్ వాకబు చేస్తున్న సమయంలో… అవసరం లేదని అంటూ బాలకృష్ణ అప్పటికప్పుడు తన వద్దనున్న “గోల్డ్ కార్డులు” తెప్పించి వాడినట్టు తెలుస్తోంది. ఇవి ఎవరో తనకు గిఫ్ట్ గా ఇచ్చినవని, వీటిని ఈ సన్నివేశంలో వాడుకుందామని స్వయంగా బాలయ్య బాబే చెప్పడంతో “డిక్టేటర్”లో పేకాట కూడా మాంచి రిచ్ గా ఉండబోతోందని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

సెట్ లోకి “గోల్డ్ కార్డు”లను బాలకృష్ణ తెచ్చినపుడు చిత్ర యూనిట్ అంతా థ్రిల్ ఫీలయ్యారట. బాలీవుడ్ నటి రతి అగ్నిహోత్రి పాల్గొన్న ఓ కీలక సన్నివేశంలో ఈ గోల్డ్ కార్డులను వాడినట్టు టాక్. ఈ సీన్ గురించి ఇంకాస్త సమాచారం కావాలంటే మరో వారం రోజులు వెయిట్ చేయాల్సిందే.