Balakrishna fans afraid of his role in ruler movieనందమూరి బాలకృష్ణ కేఎస్ రవికుమార్ చిత్రం రూలర్ లో బాలయ్య రెండు పాత్రలలో కనిపించబోతున్నారని గత కొంత కాలంగా వార్తలు హల్ చల్ చేస్తుంది. ఒక పాత్రలో పోలీసుగా ఇంకో పాత్రలో ఐటీ ప్రొఫెషనల్ గా కనిపించనున్నాడని సమాచారం. అయితే తాజాగా తెలిసింది ఏమిటంటే బాలయ్య డ్యూయల్ రోల్ కాదట.

గజినీ సినిమా మాదిరి గతం మర్చిపోయి బాలయ్య రెండు గెట్ అప్ లలో కనిపించబోతున్నారట. అయితే బాలయ్య సినిమాలలో విజయేంద్ర వర్మ, లయన్ సినిమాలు కూడా అదే లైన్ లో సాగాయి. అయితే ఆ రెండు సినిమాలు ప్లాపులుగా మిగిలాయి. ఈ క్రమంలో మరోసారి అటువంటి సినిమా ఎందుకని వారి అనుమానం.

డిసెంబర్ 20న క్రిస్మస్ సంధర్భంగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. క్రిస్మస్ బరిలో రవితేజ డిస్కో రాజా, సాయిధరమ్ తేజ్ ప్రతి రోజు పండగే సినిమాల నుండి గట్టి పోటీ ఎదురుకోబోతుంది. ఇప్పటివరకు సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తో సినిమా మీద బజ్ ఏమైనా పెరుగుతుందేమో చూడాల్సి ఉంది.

సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, భూమిక చావ్లా, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలయ్య వందవ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణికి స్వరాలు కూర్చిన చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా.. రామ్‌ప్రసాద్ కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు.