balakrishna dictator movie release dateనందమూరి ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘డిక్టేటర్‌’ చిత్రంను సంక్రాంతికి విడుదల చేస్తాం అంటూ తాజాగా దర్శక నిర్మాత శ్రీవాస్‌ స్వయంగా ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం అనుమానమే అంటున్నారు. చిత్రీకరణ ఇంకా చాలా బ్యాలన్స్‌ ఉందని, అది పూర్తి అయ్యేందుకు కనీసం నెల రోజులు అయినా పడుతుందని అంటున్నారు. బాలకృష్ణ ఇతర కార్యక్రమాతో బిజీగా ఉండటం వల్ల పలు సార్లు షూటింగ్‌కు అంతరాయం కలిగిందని, అందుకే సినిమా షూటింగ్‌ ఆలస్యం అయ్యిందని అంటున్నారు.

షూటింగ్‌ వచ్చే నెలలో పూర్తి అయితే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి అనుకున్న సమయానికి అంటే జనవరి 14న విడుదల చేయడం అంటే కాస్త కష్టమైన పనే. కాని బాలకృష్ణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముందుగా అనుకున్న డేట్‌కు సినిమాను విడుదల చేసి తీరాల్సిందే అంటూ దర్శకుడు శ్రీవాస్‌తో గట్టిగా చెబుతున్నాడట. దాంతో ఒక వైపు చిత్రీకరణ చేస్తూనే మరో వైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జరుపుతున్నారు. ఇలా జరుపుతున్నా కూడా ‘డిక్టేటర్‌’ సంక్రాంతికి వంద శాతం వస్తుందన్న నమ్మకం లేదు.