balakrishna-dictator-censor-talk-reaises-expectations-highవాస్తవ పరిస్థితులను గమనిస్తే… ఈ సంక్రాంతికి విడుదల కానున్న నాలుగు సినిమాలలో అత్యంత తక్కువ అంచనాలు కలిగిన చిత్రం “డిక్టేటర్.” అయితే అనూహ్యంగా ఈ సినిమా సెన్సార్ పూర్తయిన తర్వాత “డిక్టేటర్” అదిరిపోయిందంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్న విషయం.

నందమూరి నటసింహం బాలయ్య బాబును అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో సరిగ్గా అదే రీతిలో దర్శకుడు శ్రీవాస్ చూపించారని, మరోసారి నందమూరి బుల్లోడు గర్జించాడనే టాక్ ఊపందుకోవడంతో “డిక్టేటర్”పై అంచనాలు మొదలయ్యాయి. ఫస్టాఫ్ అదిరిపోయిందని, సెకండాఫ్ లో ఫ్యామిలీ సెంటిమెంట్ ఇరగదీసిందనేది సోషల్ మీడియా సారాంశం.

రెండు, మూడు కట్స్ తో ఈ సినిమాకు సెన్సార్ బోర్డు “యు/ఎ” సర్టిఫికేట్ ను మంజూరు చేసింది. అబ్బాయి జూనియర్ సినిమా “నాన్నకు ప్రేమతో”తో ఉన్న పోటీ రీత్యా, సెన్సార్ సభ్యుల నుండి “డిక్టేటర్”కు వచ్చిన టాక్ తో నందమూరి అభిమానులు నూతన ఉత్సాహంలో ఉన్నారు.