Balakrishna-Chiranjeeviమెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు “విజేత” సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పబ్లిసిటీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, సాంగ్స్ ద్వారా జరుగుతుండగా, ఈ నెల 24వ తేదీన ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి రానున్న ఈ వేదికపై నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా కనిపించనున్నారనే టాక్ ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.

వారాహి సంస్థతో ఉన్న అనుబంధంతో పాటు, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో బాలయ్యకున్న సన్నిహిత సంబంధాల రీత్యా ఈ మెగా వేడుకలో నందమూరి అందగాడు రాబోతున్నాడని తెలుస్తోంది. గతంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వేదికపై బాలకృష్ణ – చిరంజీవిలు ఒకేసారి కనిపించి ప్రేక్షకులను అలరించారు. మళ్ళీ ‘విజేత’ సినిమాతో ఆ ఫీట్ రిపీట్ కాబోతుందనే సమాచారాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.