Balakrishna Car Accident Hyderabad, Nandamuri Balakrishna Car Accident Hyderabad, Nandamuri Balakrishna Car Rams Roadside Pole Banjara Hillsనందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన 100వ సినిమా “గౌతమీపుత్రశాతకర్ణి” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉత్తరాదిన చారిత్రాత్మక కోటలలో జరుపుతున్నారు. అయితే మరోపక్కన హైదరాబాద్ లో బాలకృష్ణ టయోటా ఫార్చునర్ కారు యాక్సిడెంట్ కు గురికావడం విశేషం.

కారులో బాలయ్య బాబు లేకపోవడంతో అంతగా ప్రాధాన్యత లభించని ఈ వాహన యాక్సిడెంట్ దృశ్యాలు చూసిన వారు అవాక్కవుతున్నారు. ఏదో చిన్న యాక్సిడెంట్ అని భావించిన వారికి షాక్ ఇచ్చే విధంగా రోడ్డుపైన డివైడర్ ను డీ కొట్టిన కారుకు డ్యామేజ్ బాగానే జరిగింది. కరెంటు స్తంభాన్ని డీ కొట్టిన కారు ముందు భాగం అంతా తుక్కుతుక్కుగా మారిపోవడం విశేషం.

ఈ ఘటనకు సంబంధించి వివరాలు బయటకు వెల్లడికాకపోవడంతో, కారులో ఉన్న వ్యక్తి ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. ప్రాధమిక సమాచారం ప్రకారం బాలకృష్ణ డ్రైవర్ అని వచ్చినప్పటికీ, ఇందులో ఎంత వాస్తవం ఉందో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచడమే దీనికి కారణం.