Balakrishna campaign for huzur nagar byelectionహుజుర్ నగర్ ఉపఎన్నికలో టీడీపీ పోటీకి దిగింది. సీనియర్ నేత చావా కిరణ్మయిని అభ్యర్థి గా పెట్టి ప్రచారం కూడా మొదలు పెట్టింది. అక్టోబర్ 21 న పోలింగ్, 24న కౌంటింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ వారు కోరినా పార్టీ క్యాడర్ ని నిలుపుకోవడం కోసం బరిలో ఉండటమే మంచిదని నిర్ణయించుకుంది.

2014లో టీడీపీ ఇక్కడ నాలుగవ స్థానములో ఉంది. అప్పటి ఎన్నికలలో పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ మూడవ స్థానంలో ఉండటం విశేషం. దీనితో ఈ ఎన్నిక టీడీపీకి అంత తేలిక కాదు. హుజుర్ నగర్ లో చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తారో లేదో తెలీదు గానీ బాలయ్య బాబుని మాత్రం రంగంలోకి దిగుతున్నారట.

ఈ నెల 13 నుండి 18 మధ్య ఆయన ప్రచారం షెడ్యూల్ ఫైనల్ అవుతుందని సమాచారం. దీనిపై పార్టీ కసరత్తు చేస్తుంది. పార్టీకి అవసరం అంటే బాలయ్య ఎప్పుడూ ఎటువంటి లెక్కలు వేసుకోకుండా పార్టీ కోసం ముందు ఉంటారు బాలయ్య. ఈ నిర్ణయంతో ఆ విషయం మరో సారి ప్రూవ్ అయ్యిందని టీడీపీ అభిమానులు సంబరపడుతున్నారు.

2018 తెలంగాణ ఎన్నికలలో బాలయ్య చాలా బలంగా ప్రచారం చేసి అధికార పార్టీ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఈ సారి అంత వేడి ఉండకపోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు కూడా రంగంలోకి దిగితే ప్రచారానికి మరింత ఊపు వస్తుంది. మరి దీనిపై చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.