Balakrishna C Kalyan Movieనందమూరి బాలకృష్ణ అభిమానుల మీద పెద్ద పిడుగు పడింది. ఈరోజు సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. బాలయ్య తో త్వరలో ఇంకో సినిమా చేస్తా అని, బాలయ్య తన సంస్థని సొంత సంస్థగా భావిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వార్త అభిమానులకు అసలు రుచించడం లేదు.

బాలయ్య సి కళ్యాణ్ కాంబినేషన్ లో ఇప్పటివరకూ మూడు సినిమాలు వచ్చాయి… పరమవీర చక్ర, జైసింహా, రూలర్, పరమవీర చక్ర అప్పట్లో బాలయ్య కేరీర్ లోనే అతిపెద్ద ప్లాప్… రూలర్ కూడా ప్లాప్ గానే ముగిసింది. జైసింహా ఆ ఏడాది సంక్రాంతికి విడుదలయ్యి మిగిలిన సినిమాలన్నీ ప్లాప్ కావడంతో యావరేజ్ అనిపించుకుంది.

సినిమా ఫలితాలు పక్కన పెడితే సి కళ్యాణ్ నిర్మాణంలో వచ్చే సినిమాలన్నీ నాసిరకంగానూ… పేలవమైన అవుట్ డేటెడ్ కాంబినేషన్లలో ఉంటాయి …. విడుదల తరువాత పబ్లిసిటీ కూడా ఉండదు. దానితో సి కళ్యాణ్ సినిమా అంటేనే అభిమానులు వద్దే వద్దు అంటారు. ఇప్పుడు వచ్చిన ఈ వార్తతో వారు దిగాలు పడుతున్నారు.

బాలయ్య ప్రస్తుతం బోయపాటి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది విడుదల కావాల్సిన ఆ సినిమా నిరవధికంగా వాయిదా పడింది. ఆ సినిమా తరువాత బీ. గోపాల్, శ్రీవాస్ వంటి దర్శకులతో సినిమాలు ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి.