నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన “అఖండ” సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా హైప్ కు మూలకారణంగా భావించే ట్రైలర్ ను కట్ చేసే పనిలో దర్శకుడు బోయపాటి ఉండగా, తాజాగా ఈ ట్రైలర్ లోని డైలాగ్స్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాలయ్య డైలాగ్స్ చూస్తే లీక్ చేయకుండా ఉండలేరు అన్న విధంగా నెట్టింట సందడి చేస్తోంది ఈ డైలాగ్!

“ఫ్రంట్ లేదు, బ్యాక్ లేదు, రైట్ లేదు, లెఫ్ట్ లేదు… అటు వైపు నేనే, ఇటు వైపు నేనే…” అంటూ బాలయ్య బాబు చెప్పే మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్ కు నూతన ఉత్సాహాన్ని పంచుతున్నాయి. పవర్ ఫుల్ మాస్ డైలాగ్సే బాలకృష్ణ సినిమా నుండి అభిమానులు ఆశించేది. దానికి బోయపాటి మార్క్ ను జోడిస్తే రిజల్ట్స్ ఏమిటో “సింహా, లెజెండ్” సినిమాలు చెప్పకనే చెప్పాయి. తాజాగా లీక్ అయిన డైలాగ్స్ తో ‘అఖండ’ కూడా అదే ఫలితాన్ని అందుకుంటుందని అభిమానులు గంపెడు ఆశతో ఉన్నారు.