Mahesh-Babu-Krishnaఈ కంపెనీల పేర్లు ఎవరికీ పెద్దగా పరిచయం ఉండదు. అసలు ఇవి నిత్యమూ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అవుతాయన్న సంగతి కూడా పెద్దగా గుర్తుండదు. వీటి ఈక్విటీ విలువ ఎంతైనా మార్కెట్లో ధర 10 కన్నా తక్కువే. ఈ కంపెనీలు గత ఏడు నెలల కాలంలో తమను నమ్మి పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం ఏడు రెట్లకు పైగా… ఇంకా చెప్పాలంటే 730 శాతం రాబడిని అందించాయి.

ఉదాహరణకు పద్మాలయా టెలీఫిల్మ్స్… హైదరాబాద్ కేంద్రంగా టెలివిజన్ సీరియల్స్ నిర్మాణ సంస్థ. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంలోని ఘట్టమనేని రమేష్ బాబు, దుర్గాంబ, పార్వతి, గల్లా జయదేవ్, కృష్ణా ప్రొడక్షన్స్ తదితరులు ప్రమోటర్లుగా ఉన్న సంస్థ. జనవరి 2న ఈ కంపెనీ ఈక్విటీ ధర 1.20 మాత్రమే. అదే ఆగస్టు 2కు వచ్చేసరికి 9.96కు పెరిగి 730 శాతం లాభాన్ని అందించింది. అంటే, జనవరి తొలి వారంలో ఈ కంపెనీలో రూ. 10 వేలు పెట్టి వుంటే, ఇప్పుడు దాని విలువ 83 వేల రూపాయలన్నట్టు.

ఇక మరో సంస్థ ఈస్ట్రన్ సిల్క్ ఇండస్ట్రీస్… దీని ఈక్విటీ విలువ సంవత్సరం ఆరంభంలో 2.38 కాగా, ఇప్పుడది 7.96కు పెరిగి 234 శాతం లాభాన్ని అందించింది. అలాగే సాన్వారియా ఆగ్రో ఈక్విటీ 2.55 నుంచి 7.36కు పెరిగి 190 శాతం లాభాలను అందించింది. వీటితో పాటు పారామౌంట్ కమ్యూనికేషన్స్, ఎస్ఏఎల్ స్టీల్, రతన్ ఇండియా ఇన్ ఫ్రా, టెక్ నిర్మాణ్, తజారియా పాలీ పైప్స్ వంటి కంపెనీలు కూడా మార్కెట్ లాభాలను మించి సత్తా చాటాయి.