bala-krishna-comments-increases-dictator-expectationsఈ టైంలో ఆ “డిక్టేటర్”కు ఎదురెళ్ళడం మంచిది కాదు… ప్రస్తుతం ఇదే అంటున్నారు నందమూరి అభిమానులు. పెద్దగా అంచనాలు లేనటువంటి “డిక్టేటర్”పై ప్లాటినం డిస్క్ వేడుకలు జరిగిన తర్వాత ఒక్కసారిగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి కారణం… బాలయ్య ఇచ్చిన ప్రకటన ఒకటైతే… తాజాగా విడుదల చేసిన “డిక్టేటర్” టీజర్ సినిమాపై అభిమానుల్లో నమ్మకాన్ని కలిగించింది.

బాలయ్యతో పాటు దర్శకుడు శ్రీవాస్ చేసిన ప్రకటనలు కూడా “డిక్టేటర్”పై నమ్మకాన్ని పెంచాయి. అభిమానులకే కాదు, ఈ సినిమా టికెట్ కొన్న ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచే విధంగా “డిక్టేటర్” ఉంటుందని శ్రీవాస్ వ్యాఖ్యానించారు. ఈ సినిమాకు బాలయ్య అభిమానులు అందించిన సహకారం మరువలేనిదని, ఎవ్వరికీ లేని అభిమానులు బాలయ్య సొంతమని శ్రీవాస్ ఫ్యాన్స్ ని ప్రశంసలతో ముంచెత్తారు.

“తెగ రెచ్చిపోతున్నావ్… మా లాంటి వాళ్ళతో పెట్టుకుంటే పబ్లిసిటీ వస్తుందనా..? పబ్లిసిటీనా… నాకా… మ్… నీ లాంటోళ్ళు పబ్లిసిటీ కోసం చేస్తారు… నేనేం చేసినా పబ్లిసిటీనే..! ఈ టైంలో ఆ “డిక్టేటర్”కు ఎదురెళ్ళడం మంచిది కాదు…” వంటి డైలాగ్స్ తో కూడిన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.