baddukonda appalanaidu on english medium schoolsఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ అధినేత మెప్పు కోసం ఆ పార్టీ నేతలు ఒక సామాజిక వర్గం మీద చేసే విమర్శలు చిత్రంగా ఉంటున్నాయి. తాజాగా నెలిమర్ల వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు సరిగ్గా అటువంటి ఆరోపణే చేశారు. చౌదరి (కమ్మ) సామాజిక వర్గం మనుగడ లేకుండా పోతుంది అనే జగన్ ప్రవేశ పెట్టిన ఇంగ్లీష్ మీడియంని టీడీపీ వ్యతిరేకిస్తోందని చెప్పుకొచ్చారు.

గతంలో కోర్టు ఎన్ని సార్లు మొట్టికాయలు వేసినా వ్యవస్థలను మ్యానేజ్ చేసి స్టేలు తెచ్చుకుని చంద్రబాబు ప్రభుత్వాన్ని పని చెయ్యనివ్వడం లేదని చెప్పడం గమనార్హం. ఒక ప్రభుత్వ పాలసీకి ఒక సామాజిక వర్గ మనుగడకు సంబంధం ఏంటో తెలియదు. రాజకీయాలకు సంబంధం ఏంటో అసలు తెలీదు.

అన్ని సామాజిక వర్గాల కోసం పని చేస్తున్నాం అంటూ చెప్పుకుంటున్న ప్రభుత్వం..ఒక సామాజిక వర్గం మీద మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దాడి చెయ్యడం ఏంటో అర్ధం కాని విషయం. ఆ సామాజికవర్గాన్ని వెలివేశారా అంటే అది కూడా కాదు… ఆ ప్రభుత్వంలో కూడా వారి మంత్రులు ఉన్నారు. వారు కూడా వీటిని ఖండించకపోవడం విశేషం.

ఇకపోతే ఇంగ్లీష్ మీడియం కోసం ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టు కు కూడా వెళ్ళింది. అక్కడ చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యల బట్టి అక్కడ కూడా ప్రభుత్వానికి అనుకూల తీర్పు వచ్చే అవకాశం లేదని న్యాయనిపుణులు అంటున్నారు. సుప్రీం కోర్టు వ్యవహారాలను కూడా బాబు, ఆయన సామాజికవర్గం ఖాతాలో వేసేస్తారేమో!